కేసీఆర్ ఎక్కడున్నారు?-వైఎస్ షర్మిల
వరదల్లో రాష్ట్రం విలవిలలాడుతుంటే ప్రజలను ఆదుకోవాల్సిన సీఎం కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైెస్ షర్మిల. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు సీఎం కేసీఆర్ కనీసం ఏరియల్ సర్వే కూడా నిర్వహించలేదని ధ్వజమెత్తారు. కాళేశ్వరం పంప్‌హౌజ్‌లు మునిగాయని….వాటి ప్రాజెక్టు పనులు తిరిగి మెగా కృష్ణారెడ్డికి అప్పగిస్తారని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు.
మునిగిన కాళేశ్వరం పంపుహౌజ్‌లు….మరో లక్ష కోట్లు అప్పుచేసైనా… సరే మునిగిన పంప్‌హౌజ్‌ను పైకి లేపబోతున్నారని ఎద్దేవా చేశారు. మళ్ళీ పాజెక్టు మనకే అంటున్న మెగా కృష్ణారెడ్డి….అప్పుల కోసం పరిగెత్తబోతున్న అధికారులు…..సంచులు సవరించుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం.. పాలభిషేకాలకు భజన బ్యాచ్ రెడీ అంటూ షర్మీల ట్వీట్ ద్వారా విమర్శించారు.