వాట్సాప్ మెసేజ్‌ను పంపినవారికి తెలియకుండా ఇలా చదవండి
సాధారణంగా వాట్సాప్ మెసేజ్‌లను పంపిన వారికి, దానిని ఎవరు చదివారో తెలిసిపోతుంది. బ్లూటిక్ లేకపోతే చదవలేదని అర్థం చేసుకుంటారు. కొంతమంది చదివినా ఆవిషయం పంపిన వారికి తెలియకుండా జాగ్రత్త పడదామని అనుకుంటారు. అలాంటి వారికోసం ఎలాంటి యాప్‌లు వాడనవసరం లేకుండా కొన్ని చిన్న చిన్న ఉపాయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా..
వాట్సాప్ మెసేజ్‌లను WIDGET ద్వారా చదవాలని అనుకుంటే కేవలం వాట్సాప్‌ను హోమ్ స్క్రీన్ మీదకు తెచ్చుకుంటే చాలు. దానిని ఓపెన్ చేయకుండానే అన్ని మెసేజ్‌లను హాయిగా చదువుకోవచ్చు.
వాట్సాప్ సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్స్‌కి వెళ్లి, పాపప్ నోటిఫికేషన్‌లో ONLY WHEN THE SCREEN IS OFF, ONLY WHEN SCREEN IS ON, లేదా ALWAYS SHOW POPUP అనే మూడు ఆప్షన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు. దీనివల్ల బ్లూటిక్ పడదు.
లేదా వాట్సాప్ సెట్టింగ్స్‌లో అకౌంట్ ఆప్షన్‌లో PRIVACY లో ఫీచర్లు చూడండి. రీడ్ రిసిప్ట్స్ అనే ఫీచర్‌ను డిసేబుల్ చేస్తే కూడా బ్లూటిక్ పడదు.
ఇంకొక ఈజీ ఆప్షన్ ఏంటంటే నోటిఫికేషన్ బార్ ద్వారా కూడా మెసేజ్ అందిన వెంటనే దాన్ని కిందకి జరిపి చదివితే చాలు. పంపిన వారికి మీరు చదివినట్లు తెలిసే అవకాశం ఉండదు. ఇవండీ WHATSAPP మెసేజ్‌లు రహస్యంగా చదివే పద్దతి. పాటిస్తారు కదూ..

