(April 5) బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు జరుపుకుంటాము?
ఈ రోజు (ఏప్రిల్ 5) బాబు జిగజ్జీవన రామ్ జయంతి దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ రోజు దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ కార్యాలయాలకు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారు. ఆయన ప్రత్యేకలు ఏమిటి? చరిత్రలో ఆయన స్థానం ఏంటి వంటి విషయాలు చాలా మందికి తెలియవు. దేశభక్తుల పేర్లు, స్వాతంత్య్ర సమర యోధుల పేర్లు చాలామంది వినే ఉంటారు. కానీ ఈయన పేరు అంతగా చాలామందికి తెలియదు. ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించిన విశేషాలు తెలుసుకుందాం.

బాబు జగజ్జీవన్ రామ్ ఒక అంటరాని కులంలో బీహార్‌లోని, చాంద్వాలో 1908లో జన్మించారు. ఆయన చిన్నతనం నుండి సమాజంలోని కులవివక్షతను, కుల పెద్దల ధోరణులను గమనించేవారు. ఆయన కులాల మధ్య అసమానతలను గమనించి, ఆ వయస్సులోనే దానికి వ్యతిరేకంగా గళమెత్తారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, వారికి సమాజంలో గౌరవ స్థానం కల్పించడం కోసం పోరాటాలు చేసేవారు. కుల వివక్షతను ఎదిరిస్తూ డిగ్రీ పట్టభద్రులయ్యారు. కళాశాలలో చదివే రోజులలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలు, దేశభక్తి,, విప్లవ పోరాటం ఆయనను ఆకర్షించాయి. ఇదే ఆయనను రాజకీయాల వైపు ఆకర్షించింది. 1935లో ఆల్ ఇండియా డిప్రెస్సడ్ క్లాసెస్ లీగ్‌ను ఏర్పాటు చేసి, అణగారిన వర్గాలు, అంటరానిజాతి వారి హక్కుల కోసం పోరాటం చేయసాగారు.

స్వతంత్య్రానంతరం జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో ఏర్పాటైన భారత ప్రభుత్వంలో లోక్‌సభ సభ్యునిగా భాగమయ్యారు. చిన్న వయస్సులోనే లోక్‌సభ సభ్యునిగా, కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. 1970 నుండి 74 వరకు ఢిపెన్స్ మినిస్టర్‌గా, 1977 నుండి 79వరకు ఉప ప్రధానమంత్రిగా కూడా దేశానికి సేవలందించారు. 1986లో ఆయన చనిపోయేంతవరకూ ఎంపీగానే కొనసాగారు. అతి ఎక్కువకాలం ఎంపీగా పనిచేసిన రికార్డు ఆయనదే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో సభ్యునిగా స్వతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర వహించారు. లోక్‌సభ సభ్యునిగా, కేంద్రమంత్రిగా, ఉప ప్రధానిగా షెడ్యూల్ కులాలు, జాతుల వారికి సమన్యాయం కలిగించడంలో, వారికి రిజర్వేషన్లు కల్పించడంలో ముఖ్యపాత్ర వహించారు. అందుకే సామాజిక న్యాయానికి, దళిత ప్రజల అభ్యున్నతికి గుర్తుగా ఆయన జయంతి రోజును కేంద్రప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో సెలవు దినంగా ప్రకటించింది. జాతీయ దినంగా ప్రకటించింది.