20 ఓవర్లలో న్యూజిలాండ్ స్కోరెంతంటే..
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ రసవత్తరంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 20 ఓవర్లు ముగిసేసరికి 100 పరుగులు చేసింది. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్రను కుల్దీప్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేయడంతో టీమిండియా అభిమానులు పండుగ చేసుకున్నారు. క్రీజ్‌లో ఉంటే ఎదుటి టీమ్‌కు చెమటలు పట్టించే కేన్ విలియమ్సన్(11) వద్ద కుల్దీపే పెవిలియన్‌కు చేర్చడం విశేషం. దీనితో ఇండియా అభిమానులు సంబరపడుతున్నారు.

