ఎండు చేపలు తింటే ఏమవుతోంది..?
చాలా మంది చేపలు తినడానికి ఇష్టపడతారు. అయితే ఎండు చేపలు తినడానికి తెగ బాధపడుతూ ఉంటారు. ఎండు చేపల వాసన ఎక్కువగా ఉండటం వల్ల వాటిని తినడానికి విముఖత చూపిస్తారు. పచ్చి చేపలను తినే చాలా మంది ఎండు చేపలను మాత్రం తినటానికి నో అంటారు. అయితే ఎండు చేపలను తినే వాళ్లు మాత్రం వాటిని చాలా ఇష్టంగా తింటారు. వాటి రుచి తింటేనే తెలుస్తుంది అని చెప్తారు. అయితే ఎండు చేపలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎండు చేపలు.. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతాయి.
నరాల, కండరాల సమస్యలను తగ్గించి.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఎండు చేపల్లో ప్రొటీన్లతో పాటు విటమిన్ బి12, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండటమే కాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎండు చేపల్లోని కాల్షియం, ఫాస్పరస్ వల్ల ఎముకలకు మేలు జరుగుతుంది. బీపీ నియంత్రణలో ఉండటంతోపాటు నరాల సమస్యలను తగ్గించి కండరాల నిర్మాణానికి ఎండు చేపలు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎండు చేపలను తింటే దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దంతాలు బలోపేతం అవుతాయి. ఎండు చేపలలో ఉండే విటమిన్ బి 12 శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కేవలం వాసనను బట్టి ఎండు చేపలను తినకుండా ఉండొద్దు. అందుకే ఇన్ని ప్రయోజనాలున్న ఎండు చేపలను తినడం మొదలు పెట్టండి మరి.

