కార్చిచ్చు ఆపేందుకు వెళ్లిన హెలికాఫ్టర్‌కి ఏమయ్యిందంటే..
దక్షిణ కొరియాలో కార్చిచ్చు వ్యాపించింది. పొడిగాలుల కారణంగా ఇది వేగంగా వ్యాపిస్తోంది. ఈ మంటలను ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మంటలను ఆపేందుకు వెళ్లిన ఒక హెలికాఫ్టర్ కూడా కూలిపోయింది. ఈ ఘటనలో పైలెట్ మృతి చెందారు. ఈ మంటల కారణంగా ఇప్పటి వరకూ 20 మంది మృతి చెందారని సమాచారం. మరింతమంది గాయాలపాలయ్యారు. ఉయుసాంగ్ కౌంటీ అనే ప్రాంతంలో 1300 సంవత్సరాల నాటి పురాతన గౌన్సా దేవాలయం కాలిపోయిందని సమాచారం. అయితే అక్కడి విగ్రహాలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీటిని ఆపేందుకు 10 వేల మంది సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 43 వేల ఎకరాలు కాలి బూడిదయ్యాయని ప్రధాని పేర్కొన్నారు.

