Home Page SliderTelangana

టికెట్ రాలేదని కాంగ్రెస్‌లోకి వస్తే ఏంచేయలేమన్న ఎంపీ

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది కీలక నేతలకు టికెట్ దక్కలేదు. దీంతో వారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలా కాంగ్రెస్ గూటికి చేరే వారిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ పార్టీలో టికెట్ రాక ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వచ్చే వాళ్లకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాగా ఈ రోజు నకిరేకల్‌లో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీలో టికెట్ రాలేదనే కాంగ్రెస్‌లోకి వస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని ఉద్ధేశిస్తూ పరోక్షంగా విమర్శించారు. గతంలో టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ వ్యాఖ్యలు చేశారన్నారు. అయితే  ప్రస్తుతం తాను లాగ్‌బుక్‌లు చూపించి నష్టనివారణ చేశానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.