అట్టహాసంగా మొహర్రం ఊరేగింపు…
హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ‘బీబీకా ఆలం’ ఊరేగింపును భక్తి, శ్రద్ధలతో అట్టహాసంగా జరిగాయి. మూసీ నది ఒడ్డున, చాదర్‌ఘాట్ వద్ద ఊరేగింపు కొనసాగనుంది. త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం సందర్భంగా సంతాప దినాల్లో భాగంగా షియా ముస్లింలు కత్తులతో, బ్లేడ్లతో తమ శరీరాలపై కొట్టుకుంటూ తమ రక్తాన్ని చిందించడం జరుగుతుంది. మొహర్రం వేడుకల్లో మాతం చేస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తారు. వేడుకల్లో భాగంగా.. తెలంగాణ పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. బీబీకా ఆలంను వీక్షించడానికి తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. కోవిడ్ కారణంతో రెండేళ్ళ తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకుండా మొహర్రం వేడుకలను నిర్వహించడం జరిగింది.