NationalNews

త్వరలోనే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతారు…

Share with

బీహార్‌లో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు భారత దేశంలో హాట్‌ టాపిక్‌గా మారాయి. దీనిపై పలు ప్రధాన పార్టీల నేతలు స్పందిస్తున్నారు. బ్రిటీష్‌ కాలంలో `ఆంగ్లేయులు భారత్‌ను వీడాలి` అనే నినాదాన్ని ఇదే రోజు ఇచ్చారని..  సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. బీజేపీని వెళ్ళగొట్టాలి అనే నినాదం ఇవాళ బీహార్‌ నుండి వస్తోందని, ఇటువంటి నినాదం ఇదే రోజు రావడం శుభపరిణామమని అన్నారు. త్వరలోనే వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీలు, ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతారని తాను భావిస్తున్నట్లు అఖిలేష్‌ పేర్కొన్నారు.