Home Page Sliderhome page sliderNewsPoliticsTelanganaviral

తల్లికి వందనం డబ్బు అడిగారని…వెల్ఫేర్ అసిస్టెంట్ దాడి

తల్లికి వందనం పధకం డబ్బులు అడిగినవారిపై వెల్ఫేర్ అసిస్టెంట్ దాడి చేసి న ఘటన వెలుగుచూసింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం లోని బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది. ఒడిగిలవారిపల్లికి చెందిన నాగభూషణం, అనురాధ, శంకరప్ప తదితరులు గుమ్మసముద్రం లోని సచివాలయానికి తల్లికి వందనం డబ్బు పడిందా.. లేదా..? అని అడగడానికి వెళ్లారు. డబ్బు పడిందా లేదా అని మాట్లాడడంతో ఆగ్రహించిన సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ ని అడిగిన ముగ్గురిపై దాడి చేసి గాయపరిచాడు. గాయాలపాలైన వారిలో ఒడిగిలవారి పల్లెకు చెందిన నాగభూషణం, అనురాధ, శంకరప్ప ఉన్నారు. బాధితులను బి కొత్తకోట 108 సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.