Home Page Sliderhome page sliderNational

నాగుపాములతో పెళ్లి వేడుకలు..

పెళ్లి వేడుకల్లో నాగిని డ్యాన్స్ చేయడం మామూలే. కానీ ఒడిశాలోని భద్రక్ జిల్లాలో వింత ఘటన జరిగింది. బన్సాడా పంచాయతీలోని చెడక్ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి ఊరేగింపులో ఇద్దరు పాములు పట్టుకునే వ్యక్తులు, ఓ ట్రాన్స్ జెండర్ నిజమైన నాగు పాములతో నాగిని డ్యాన్స్ చేశారు. అయితే స్థానికులు కూడా వారి డ్యాన్స్ ను ఎంజాయ్ చేస్తూ ఫోన్ లో వీడియోలు కూడా తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ సమాచారం అందిన వెంటనే భద్రక్ వన్య ప్రాణి విభాగం ఊరేగింపును అడ్డుకుని మూడు నాగుపాములను రక్షించి స్వాధీనం పరచుకున్నారు. నిందితులు పరారు కాగా పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.