Home Page SliderTelangana

సింగరేణి ఎన్నికల్లోనూ గెలుపు సాధిస్తాం

సత్తుపల్లి: సింగరేణిలో ఎన్నికల నగారా మోగడంతో ఓసీల్లో సందడి మొదలైంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో చాలామంది కార్మికులు కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్‌టీయూసీలోకి వలసలు వెళ్తున్నారు. మండల పరిధిలోని కిష్టాపురం ఓసీల్లోనూ కార్మికులు మంగళవారం పెద్ద సంఖ్యలో ఆ సంఘంలోకి చేరడంతో జనరల్ సెక్రటరీ త్యాగరాజన్ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ గెలుపులో భాగస్వామ్యమైన కార్మికులు సింగరేణి ఎన్నికల్లోనూ సత్తాచాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యుడు రావి నాగేశ్వరరావు, మంతెన బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.