మంత్రగాళ్లను చంపేస్తాం.. వాల్ పోస్టర్ల కలకలం
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో వాల్ పోస్టర్ల కలకలం రేపింది. కట్లకుంట గ్రామంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. గ్రామంలో ఉన్న మంత్రగాళ్లు తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. మంత్రగాళ్లను ఒక్కొక్కరిగా చంపుతామని, ప్రజల మంచి కోరే సంస్థ కు చాలా కంప్లైట్లు వచ్చాయని ఆ వాల్ పోస్టర్లలో బెదిరించారు. మంత్రగాళ్లతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నట్లు, వారికి సహకరించే వారికి సైతం ఆదే గతి పడుతుందని వాల్ పోస్టర్లలో ఉంది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

