క్లైమాక్స్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై హైకమాండ్ చర్యలకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి విషయంలో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్… ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో చర్చిస్తు్న్నారు. ఏ క్షణమైనా సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. షోకాజ్ నోటీస్ లేకుండా సస్పెన్షన్ వేటు వేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయ్.