సొంతగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: సిద్ద రామయ్య
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో మొదటి నుంచే ముందంజలో ఉన్న కాంగ్రెస్ హవా కొనసాగుతూనే ఉంది. కాగా ఇప్పటివరకు 130 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో కర్ణాటకలో సొంతగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ కీలక నేత,కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరి సాయం అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ మతరాజకీయాలు పనిచేయలేదని సిద్దరామయ్య తెలిపారు.

