Home Page SliderNational

ఈవీఎం మాకొద్దు.. బ్యాలెట్ పేపర్లే కావాలి..

ఓ వైపు దేశంలో బ్యాలెట్ విధానం పునఃప్రవేశపెట్టాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించగా.. మరోవైపు ఇదే విధానంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జన ఖర్గే హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు వద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ పేపర్ విధానాన్నే కోరుకుంటోందని వెల్లడించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఢిల్లీలో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. బీజేపీ రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తోందని ఖర్గే ఆరోపించారు. బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ కోసం రాహుల్ గాంధీ మరోసారి భారత్ జోడో యాత్ర చేయాలని ఖర్గే కోరారు. బ్యాలెట్ పేపర్ ఓటింగ్ అవసరంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని అన్నారు. అందుకోసం ఇతర రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడుతామని చెప్పారు.