‘పనామాపై ట్రంప్ మాటలు ఖండిస్తున్నాం’..పనామా అధ్యక్షుని ఘాటు వ్యాఖ్యలు
పనామా కాలువపై నూతన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో. ఈ కాలువ తమదేనని, అమెరికా తమకే బహుమతిగా ఇవ్వలేదని మండిపడ్డారు. స్విట్జర్లాండ్‌లోన దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న సందర్భంలో ఆయన మాట్లాడుతూ పనామా కాలువపై ట్రంప్ చెప్పిన ప్రతీ మాటనూ మేం ఖండిస్తున్నాం. ఈ కాలువ విషయంలో ట్రంప్ చెప్పినట్లు చైనా ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదన్నారు. ట్రంప్ పనామా కాలువ విషయంలో మాట్లాడుతూ దీనిని పరోక్షంగా చైనా పర్యవేక్షిస్తోందని, దానిని మేం చైనాకు ఇవ్వలేదు. పనామాకు ఇచ్చాం. దాన్ని వెనక్కు తీసుకుంటాం అంటూ పేర్కొన్నారు.

