కలిసి ఉంటేనే ప్రత్యర్థులను ఓడించగలం..
కేసీఆర్ పాలనపై వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ పేర్కొన్నారు. ఈ వ్యతిరేకతను కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకోవాలన్నారు. పార్టీ నేతలంగా ఐక్యంగా పనిచేయాలని.. కాంగ్రెస్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కలిసి ఉంటేనే ప్రత్యర్థులను ఓడించగలమని నేతలకు హిత బోధ చేశారు. మీరందరిని చేతులు జోడించి కోరుతున్నా.. సమస్యలుంటే అంతర్గతంగా చర్చించండి. బయటికి చెప్పొద్దు అని పేర్కొన్నారు. ఎంత పెద్ద నాయకులైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దిగ్విజయ్ వార్నింగ్ చేశారు. చిన్న వయస్సులో ఉన్నవారికి పీసీసీ ఇస్తే తప్పేంటి? కొత్త వారికి పీసీసీ చీఫ్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నయని వివరించారు. మరోవైపు రాహుల్ యాత్రకు మంచి స్పందన వస్తోందన్నారు. అయితే.. జోడో యాత్రను అడ్డుకోవడానికి కేంద్రం కుట్రలు చేస్తోందని దిగ్విజయ్ ఆరోపించారు.

