‘గతంలో బీఆర్‌ఎస్ చేసిన పనే మేం చేస్తున్నాం’..షబ్బీర్ అలీ
గతంలో బీఆర్‌ఎస్ చేసిన పనినే నేడు మేం కూడా చేస్తున్నాం. ఇది మీరు నేర్పిన విద్యయే అంటూ బీఆర్‌ఎస్ నేతలను ఎద్దేవా చేశారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. వారి ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతుంటే వారికి ఇప్పుడు బాధగా ఉందని, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నప్పుడు మాకు అదే బాధ కలిగిందన్నారు. గతంలో శాసన సభలో భట్టికి ప్రతిపక్షనేత హోదాను కూడా లేకుండా చేశారన్నారు. అలాగే బీఆర్‌ఎస్ కార్యాలయం కోసం 11 ఎకరాల భూమి తీసుకున్నారని, ఆభూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని కోరారు. కోకాపేటలో కూడా బీఆర్‌ఎస్ పార్టీకి ఇచ్చిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేలం వేయాలి. వేలం వేసిన సొమ్మును రుణమాఫీకి ఉపయోగించవచ్చు. ఇక బీఆర్‌ఎస్ పార్టీ ఖతం అయినట్లే అని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.

