InternationalNews

జియో పగ్గాలు కొడుక్కి కట్టబెట్టిన అంబానీ

Share with

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ జియో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. జియో పగ్గాలను తనయుడు ఆకాష్ కు కట్టబెట్టారు. జియో బోర్డుకు రాజీనామా చేసిన అంబానీ… ఇకపై తనయుడు ఆకాష్ అంబానీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ గా నామినేట్ చేశారు. ఐతే జియో ఫ్లాట్ ఫామ్ ఛైర్మన్ గా మాత్రం ముకేశ్ అంబానీ కొనసాగనున్నారు. జియో టెలికామ్ వాల్యూ లక్ష కోట్ల రూపాయలని అంచనా. 2022లో జియో ఆదాయం 22 శాతం మేర పెరిగింది. దేశంలో అతిపెద్ద టెలికామ్ కంపెనీగా జియో ఆవిర్భవించింది. మార్కెట్లో జియో షేర్ దాదాపు 37 శాతం. 27 డిసెంబర్ 2015లో జియో టెలికామ్ సంస్థను ముకేశ్ అంబానీ ప్రారంభించారు.