NewsTelangana

హైకోర్టు సీజేగా ఉజ్జల్ భయాన్ ప్రమాణస్వీకారం

Share with

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భయాన్ ప్రమాణస్వీకారం చేశారు. ఉజ్జల్ భయాన్ తో గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. తెలంగాణ చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించిన సతీష్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. తెలంగాణ హైకోర్టులో సీనియార్టీ ప్రకారం రెండో స్థానంలో ఉండటంతో ఆయన చీఫ్ జస్టిస్‌గా పదన్నోతి పొందారు.

ఉజ్జల్ భుయాన్ అసోం రాజధాని గౌహతిలో జన్మించారు. 1991లో న్యాయవాదిగా జీవనం ప్రారంభించి… ఈశాన్య రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయవాదిగా పనిచేశారు. 2009 వరకు మేఘాలయ, అరుణ్‌చల్ ప్రదేశ్ ప్రభుత్వ శాఖలకు న్యాయవాదిగానూ వ్యవహరించారు. 2011లో అసోం అదనపు అడ్వొకేట్ జనరల్ హోదా పొంది.. అదే ఏడాది అక్టోబర్ 17న గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో శాశ్వత న్యాయమూర్తి హోదా పొందారు. 2019లో బాంబే హైకోర్టుకు బదిలీ కాగా… 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు.

హైకోర్టు సీజే ప్రమాణస్వీకారోత్సవ సందర్భంగా సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వచ్చారు. గత 9 నెలలుగా రాజ్ భవన్ కు రాని కేసీఆర్… రావడంతో ఒక్కసారిగా వార్తలు పతాక శీర్షికలయ్యాయ్. కేసీఆర్ సహకరించడం లేదని… గవర్నర్ చెబుతుంటే… గవర్నర్ రాజ్యాంగ పరిధి అతిక్రమిస్తున్నారని టీఆర్ఎస్ అంటోంది. కేంద్రంతో కేసీఆర్ సర్కారు అమీతుమీ అనడంతో ఇరు పక్షాల మధ్య భారీగా గ్యాప్ వచ్చింది.