Home Page SliderNational

ఆఫ్‌లైన్‌లో మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారా?

 ఈ కాలంలో మనీ ట్రాన్స్‌ఫర్ చెయ్యడానికి మనమందరం ఫోన్‌పే,గూగుల్‌పే,పేటియం వంటి వాటిని చాలా విరివిగా వాడుతున్నాము. ఈ యాప్‌లను వినియోగించాలంటే మనకి నెట్‌వర్క్ తప్పనిసరి. నెట్‌వర్క్  లేని సమయంలో మనం ఈ యాప్‌లను వినియోగించలేము. అయితే ఈ నెట్‌వర్క్ సమస్యలు లేకుండా ఆఫ్‌లైన్‌లో UPI ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. దీనిని  వినియోగించాలంటే ముందుగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా *99# డయల్ చేయాలి. ఇలా చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్‌కు ఓ మెనూ పాప్ వస్తుంది. అందులో సెండ్ మనీ,రిక్వెస్ట్ మనీ ,చెక్ బ్యాలెన్స్ తోపాటు మరికొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీనిలో సెండ్ మనీ ఆప్షన్ సెలెక్ట్ చేసి ..పంపాలనుకున్న మొత్తం ఎంటర్ చేసి ,సెండ్‌పై క్లిక్  చేసి,పిన్ ఎంటర్ చేయాల్సివుంటుంది. కాగా దీని ద్వారా అత్యధికంగా రూ.5000/- పంపే అవకాశముంది. ఇందుకోసం 0.50 పైసలు ఛార్జ్ అవుతుంది.