బీటెక్‌లో బ్రాంచ్ మారాలనుకుంటున్నారా… నేటి నుండే
తెలంగాణ బీటెక్ కోర్సులో కన్వీనర్ కోటాలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు తమకు నచ్చిన బ్రాంచ్‌లోకి మారే చివరి అవకాశాన్ని కల్పిస్తున్నారు. నేటి నుండి ఇన్టర్నల్ స్లైడింగ్ విధానంలో సీటు పొందిన కాలేజీలో నచ్చిన గ్రూప్ కోసం ప్రయత్నించవచ్చు. స్లైడింగ్ విండో ఓపెన్ కానుంది. ఈ విధానంలో బ్రాంచ్ మారినప్పటికీ బోధనా రుసుము కూడా ట్రాన్స్‌ఫర్ అవుతుందని విద్యాశాఖ ప్రకటించింది. నేటి ఉదయం 11.30 నుండి ఖాళీ సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం రెండు నుండి ఆప్షన్ల నమోదు మొదలవుతుంది. రేపటి వరకూ సమయం ఉంది. వీరికి ఎలాట్ అయిన సీట్లను ఈ నెల 24న కేటాయిస్తారు. అనంతరం తరగతులు మొదలవుతాయని అధికారులు పేర్కొన్నారు.


 
							 
							