వివేకా హత్య ఆస్తుల కోసం కాదు… ప్రజా నాయకుడి క్యారెక్టర్‌ను చంపొద్దు!
ఇప్పటి వరకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను శిక్షించాలంటూ మాత్రమే మాట్లాడిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య ఆస్తుల కోసం జరగలేదన్నారు. వాస్తవానికి వివేకా ఆస్తులన్నింటినీ, కుమార్తె సునీత పేరుతో ఎప్పుడో రాశారన్నారు. అలాంటప్పుడు ఆస్తుల కోసం వివేకాను ఎవరైనా ఎలా చంపుతారని ప్రశ్నించారు. ఒకవేళ ఆస్తుల కోసం చంపాలనుకుంటే వివేకాను కాదు, సునీతను చంపాల్సి ఉంటుందన్నారు షర్మిల. చిన్నాన్న పేరుతో అసలు ఆస్తులే లేవన్నారు. కుమార్తె సునీతకు చెందేలా ఎప్పుడే వీలు రాశరని తేల్చి చెప్పారు.

కొందరు చనిపోయిన వివేకానంద రెడ్డి గురించి అవాకులు, చెవాకులు పేలుతున్నారని… అది మంచి పద్ధతి కాదన్నారు వైఎస్ షర్మిల. వివేకానంద రెడ్డి ప్రజల మనిషి అని, ప్రజా నాయకుడి గురించి… పులివెందుల ప్రజలకు అన్నీ తెలుసునన్నారు. ఎవరైనా సమస్య తీసుకొస్తే అది పరిష్కరించే వరకు వెంటపడి మరీ పనిచేసేవారన్నారు. సమస్య పరిష్కారం కోసం నిద్రకూడా పోయేవారు కారన్నారు షర్మిల. సమస్య పరిష్కారం కోసం పనిచేసిన ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి అని… ఆయన వ్యక్తిత్వాన్ని కొన్ని మీడియా హౌస్‌లు దారుణంగా చిత్రీకరిస్తున్నాయని… వారెవరికీ కూడా వివేకా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. వివేకాపై ఇష్టానుసారంగా వార్తలను ప్రచురిస్తున్న మీడియా హౌస్‌లు నిజాలు తెలుసుకోవాలన్నారు. మీడియా హౌస్‌లకు విశ్వసనీయత ఉండాలన్నారు. వివేకా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు షర్మిల. లేని వ్యక్తి మీద, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం దుర్మార్గమన్నారు.