2024 అమెరికా అధ్యక్ష రేసులో వివేక్ రామస్వామి
నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలోకి భారతీయ-అమెరికన్ టెక్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి ప్రవేశించారు. రెండో కమ్యూనిటీ సభ్యుడిగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. దేశంలోకి మెరిట్‌ను వెనక్కి తీసుకురావడంతోపాటుగా… చైనాపై ఆధారపడటాన్ని అంతం చేస్తానని వాగ్దానంతో 2024 ప్రెసిడెన్షియల్ బిడ్‌ను ప్రారంభించారు. రామస్వామి, 37, తల్లిదండ్రులు కేరళ నుండి అమెరికాకు వలస వచ్చారు. ఒహియోలోని జనరల్ ఎలక్ట్రిక్ ప్లాంట్‌లో పని చేస్తున్నారు. ఫాక్స్ న్యూస్ ప్రైమ్ టైమ్ షో టక్కర్ కార్ల్‌సన్, లైవ్ డిబేట్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో ప్రవేశించిన రెండో భారతీయ-అమెరికన్‌గా వివేక్ రామస్వామి నిలిచారు. ఈ నెల ప్రారంభంలో, రెండు పర్యాయాలు సౌత్ కరోలినా మాజీ గవర్నర్, ఐక్యరాజ్యసమితిలో మాజీ US రాయబారి హేలీ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం తన మాజీ బాస్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పోటీ చేస్తానని ప్రకటించారు.
అమెరికన్లు ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్‌లో బతుకుతున్నారని… చాలా కాలంగా విభేదాలను ఉత్సవాలుగా జరుపుకుంటున్నామని… అన్ని మార్గాలను మరచిపోయామని… ఈ దేశాన్ని చలనంలోకి తెచ్చేందుకు… 250 ఏళ్ల క్రితం పూర్వీకులు స్థాపించిన సిద్ధాంతాలు, ఆదర్శాలకు కట్టుబడి ఉండాలన్నారు రామస్వామి. మేల్కొనలేకపోవడం అమెరికాకు ముప్పుగా పరిణమించిందన్నారు రామస్వామి. పోయిన అమెరికా పరపతిని తాను పునర్నిర్మిస్తానని, అమెరికా అధ్యక్షబరిలో నిలిచేందుకు గర్వపడుతున్నానని చెప్పుకొచ్చాడు. ” ప్రతి ఆత్మలో ‘అమెరికా’లో ‘మెరిట్’ని తిరిగి ఉంచాలని భావిస్తున్నాను,” అని చెప్పాడు. అమెరికన్ల జీవితాల్లో ప్రతి రంగాలలో” నిర్మణాయత్మకంగా వ్యవహరించేలా పనేచేస్తానన్నారు. రెండోతరం భారతీయ అమెరికన్, రామస్వామి 2014లో రోయ్‌వాంట్ సైన్సెస్‌ను స్థాపించారు. 2015, 2016లో అతిపెద్ద బయోటెక్ IPOలకు నాయకత్వం వహించారు. బహుళ వ్యాధుల చికిత్సకు సంబంధించి FDA- ఆమోదించిన ఉత్పత్తులకు క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా ముగించాడు. హెల్త్‌కేర్, టెక్నాలజీ కంపెనీలను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. రాజకీయాల్లో స్పష్టత కోసం అమెరికన్ పౌరుల కోసం 2022లో స్ట్రైవ్ అసెట్ మేనేజ్మెంట్‌ను రామస్వామి స్థాపించాడు. ఇందులో పౌరులు వారి సమస్యలపై గళం విప్పుతారు.
అమెరికాను మొదటి స్థానంలో నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాను… కానీ అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి, మనం మొదట అమెరికా అంటే ఏమిటో మళ్లీ కనుగొనాలి. ఈ దేశాన్ని మెరిటోక్రసీ నుండి వాక్ స్వాతంత్ర్యం వరకు చలనంలోకి తెచ్చే మార్గాన్ని నిర్మిస్తానన్నారు. చైనా ఎదుగుదల వంటి బాహ్య బెదిరింపులను అమెరికా ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. విదేశాంగ విధాన ముప్పు ఎదుర్కొంటుందన్నాడు. చైనా నుండి స్వాతంత్ర్యం ప్రకటించడం, పూర్తిగా చైనా ఉత్పత్తులను నిలిపేయడం అవసరమన్నాడు. విదేశాంగ విధానానికి పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తానన్నారు. “చైనా మన సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తోందన్న వాస్తవాన్ని మనం మేల్కొనాలి. కారణం, అది రష్యన్ గూఢచారి బెలూన్ అయితే, మేము దానిని తక్షణమే కాల్చివేసి, ఆంక్షలను పెట్టేవాళ్లమన్నారు. చైనా కోసం మనం ఎందుకు అలా చేయలేదు? ” అని ప్రశ్నించాడు. సమాధానం చాలా సులభమని… . మన ఆధునిక జీవన విధానం కోసం చైనాపై ఆధారపడుతున్నాం. ఈ బంధానికి ముగింపు పలకాలన్నాడు రామస్వామి.

ప్రెసిడెంట్ పదవికి తన ప్రచారాన్ని ప్రకటించడానికి రామస్వామి టక్కర్ కార్ల్సన్ షోను ఉపయోగించుకోవడం ద్వారా ఒక విషయం స్పష్టంగా చెప్పాడన్నారు డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ చైర్ జైమ్ హారిసన్. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (MAGA) కోసం రేసు రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. రాబోయే నెలల్లో, రిపబ్లికన్‌లు అబార్షన్‌ను నిషేధించడంతోపాటుగా, సామాజిక భద్రత, మెడికేర్‌ను తగ్గించడం వరకు ప్రతిదానిపై తీవ్ర వైఖరిని తీసుకుంటారని భావిస్తున్నానన్నారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (MAGA) ఎజెండా ఎంత తీవ్రంగా ఉందో ప్రతి అమెరికన్‌కు తెలుసునని నిర్ధారించడానికి రామస్వామి ఉదాహరణగా నిలుస్తారన్నారు.

