బఫూన్లు, కామెడీ ఆర్టిస్ట్ ల్లా మారొద్దని వైసీపీ నేతలకు విష్ణు వర్థన్ సెటైర్లు
విజయవాడ, మనసర్కార్:
ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి కిసాన్ నిధిని జమచేయగా ఆ విషయాన్ని ఎక్కడ చుపించకపోగా, ముఖ్యమంత్రి పేరుతో ప్రభుత్వం ఇచ్చినట్టు ప్రకటనల్లో రావడం సమంజసం కాదన్నారు. కిసాన్ యోజన ప్రధాని ఇస్తున్న నిధి అని చెప్పకపోవడం రాజనీతి కాదని ఈ సందర్భంగా తెలిపారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ ని ఎప్పుడో వదిలించేసుకున్నారన్నారు. రాహుల్ గాంధీ ది భారత్ జోడో యాత్ర కాదు విహార యాత్ర అని చెప్పుకొచ్చారు. రాహుల్ దేశంలో ఐదు రోజులు మాత్రమే ఉంటాడు.. 25 రోజులు విహార యాత్ర చేస్తారని చెప్పారు. రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని ఏపీలోకి వస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎందరో నేతలను అవమానించిందని , కాంగ్రెస్ పార్టీ అహంకారం వలనే తెలుగుదేశం పుట్టిందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ లాంటి పార్టీలన్నీ కాంగ్రెస్ అహంకారపూరితంగానే వచ్చిన పార్టీలని దుయ్యబట్టారు. ఏపీ మొత్తం తిరిగితే రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తారని తెలిసే రాహుల్ మొత్తం తిరగడం లేదని వ్యాఖ్యానించారు. కర్నూలులో దళితులకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాహుల్ కర్నూలుకు రావాలన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన రాహుల్ గాంధీ మంత్రాలయాన్ని అపవిత్రం చేస్తుండడం సిగ్గుచేటుగా భావిస్తున్ననన్నారు. హిందువుల వ్యతిరేకి రాహుల్ గాంధీ మంత్రాలయంలో అడుగు పెట్టొద్దని , రాయలసీమలో కొండలు , కరువు మీపాపమే అని ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధి పై ఒక్కసారైనా రాహుల్ చర్చించారా? అని ప్రశ్నించారు.

