విరాట్ అనూహ్య విన్యాసం..వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఒక అనూహ్య ఘటన జరిగింది. విరాట్ కోహ్లి చేయబోయిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కివీస్‌ను ఆలౌట్ చేసి, హ్యాట్రిక్ సాధించిన భారతజట్టు విజయంలో కేన్ విలియమ్సన్ వికెట్ కీలకంగా మారింది. ఈ వికెట్ తీసిన అక్షర్ పటేల్‌ను కోహ్లి అభినందించే క్రమంలో సరదాగా పాదాలు పట్టుకోబోయాడు. దీనితో కంగుతిన్న అక్షర్ ఇదేం పనంటూ విరాట్‌ను వారించి కింద కూర్చోవడం నవ్వు తెప్పించింది. ఈ మ్యాచ్‌లో ఆద్యంతం విరాట్ కోహ్లి జోష్‌గా ఉండడం విశేషం. వికెట్ పడినప్పుడల్లా సంబరాలు చేసుకుంటూ టీమ్‌ను ఉత్సాహపరిచాడు.

