NationalNews

గుజరాత్ అల్లర్లు: ప్రధాని మోడీకి సుప్రీం కోర్టు క్లీన్ చిట్‌

Share with

2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధానమంత్రి నరేంద్రమోదీని నిర్దోషిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ హింసాకాండలో మరణించిన కాంగ్రెస్ ఎంపీ భార్య చేసిన అప్పీల్ విచారణ అర్హమైనది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రత్యేక దర్యాప్తు బృందం జారీ చేసిన క్లియరెన్స్‌ను సమర్థించింది. గుల్బర్గ్ మారణకాండలో మరణించిన ఈషాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గోద్రాలో యాత్రికులు ప్రయాణిస్తున్న రైలు కోచ్‌ను తగులబెట్టి 59 మందిని చంపిన తర్వాత మొదలైన అల్లర్లలో ఆ ఘటన అత్యంత ఘోరమైనది. మొత్తం వ్యవహారంలో రాజకీయ నేతలు, పోలీసుల ప్రమేయాన్ని ఆరోపిస్తూ మత ఘర్షణలపై విచారణ చేయాల్సిందిగా జాఫ్రీ కోరారు. మొత్తం వ్యవహారంపై కోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సిట్ ఫిబ్రవరి 2012లో మొత్తం ఘర్షణలపై పూర్తి నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. అల్లర్లు జరిగిన దశాబ్దం తర్వాత కేసు విచారణకు తగిన సాక్ష్యాలు లేవని కోర్టు తేల్చి చెప్పింది. ప్రధాని మోడీతో సహా 63 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.