Andhra Pradesh

ఏపీ ఇన్‌ఛార్జ్‌ చీఫ్‌ సెక్రటరీగా విజయానంద్‌

ఏపీ ఇన్‌ఛార్జ్‌ చీఫ్‌ సెక్రటరీగా కే. విజయానంద్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయానంద్ ప్రస్తుతం విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్‌ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుత ఛీఫ్‌ సెక్రటరీ సమీర్ శర్మ అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆసుపత్రిలో ఉండటంతో విజయానంద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సమీర్ శర్మ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్యార్జ్ అయిన తర్వాత సమీర్ శర్మ విధుల్లో చేరుతారు.