Telangana

హైకోర్టు జడ్జిగా విజయ భాస్కర్ రెడ్డి

Share with

హైకోర్టు న్యాయమూర్తిగా చాడా విజయభాస్కర్ రెడ్డి ప్రమాణ శ్రీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చేతుల మీదుగా పదవి బాద్యతలు చేపట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాకకు చెందిన విజయభాస్కర్ రెడ్డి సామాన్య రైతు కుటుంబ నేపధ్యం నుంచి ఈ స్థాయికి చేరుకున్నారు. స్వగ్రామంలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. హైదరాబాద్‌లోనే ఉన్నత చదువులు పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి న్యాయవాది పట్టా పుచ్చుకున్నారు. 2014 నుండి వివిద శాఖల్లో ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. విజయ భాస్కర్ రెడ్డి నియామకంతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.