విజయ్ సేతుపతి “మహరాజ” OTT డేట్ ఫిక్స్
తమిళ హీరో,విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన సినిమా “మహరాజ”.ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుని రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. కాగా ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే సూమారు రూ.20కోట్ల గ్రాస్ వసూలు చేసినటలు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ సినిమా జూలై 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సినిమా ఓటీటీలో తమిళం,తెలుగులో అందుబాటులోకి రానుంది.

