లైగర్ మూవీ తర్వాత టెన్షన్ టెన్షన్‌గా విజయ్
లైగర్ మూవీ ఫ్లప్ కావడంతో విజయ్ దేవరకొండ కాస్త ట్రాక్ తప్పినట్టు తెలుస్తోంది. అందుకే కొత్త ప్రాజెక్ట్‌ల విషయంలోనూ విజయ్ సైలెంట్‌గా ఉంటున్నాడు. ప్రజెంట్ సెట్స్‌పై ఉన్న ఖుషి , జనగణమన పైనే పూర్తి ఫోకస్ పెట్టినట్టు టాక్ నడుస్తుంది. కానీ విజయ్ కోసం ఇంద్రగంటి , హరీష్ శంకర్ కథ రెడీ చేస్తున్నారు. అయితే విజయ్ మాత్రం ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలపైనే దృష్టి సారించినట్టు తెలిసింది. కానీ దిల్ రాజుతో కలిసి పనిచేయడానికి విజయ్… గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

