Home Page SliderPoliticsTelanganatelangana,

ఎమ్మెల్యేల ఫిరాయింపుపై తీర్పు రిజర్వు…

తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. న్యాయవాది సింఘ్వీ మరింత సమయం కోరగా, జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తం చేస్తూ, 14 నెలల సమయం సరిపోలేదా అంటూ వ్యాఖ్యానించారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలు సానుకూలంగా తీసుకుంటే ఇంతవరకూ వచ్చేది కాదని పేర్కొన్నారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. బీఆర్‌ఎస్ తరపు న్యాయవాది అర్యమా సుందరం 8 వారాల్లోగా తీర్పు వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు.