National

వరుణ్ ధావన్-కృతిసనన్ ‘భేడియా’ ట్రైలర్

వరుణ్ ధావన్ , కృతిసనన్ జంటగా నటించిన భేడియా ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తేడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బదులు ఎదుర్కొన్నాడు?  అసలు మళ్లీ సాధారణ మనిషిగా మారాడా? లేదా? తన వల్ల అతని స్నేహితులు ఎటువంటి సమస్యలు ఎదుర్కోన్నారు? అనే ఆశక్తికర అంశాలతో రూపొందించిన చిత్రమిది. ఈ సినిమాకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించగా , కృతిసనన్ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ క్రమంలో రిలీజ్ అయిన దీని ట్రైలర్‌లో తోడేలుగా మారిన వ్యక్తిగా వరుణ్ ధావన్ నటన కనుల విందు చేసింది. ఉదయం పూట మాములు మనిషిగా ఉంటూ రాత్రి సమయంలో మాత్రం తోడేలులా మారుతూ ఇతరులపై దాడి చేయడం వంటి సన్నివేశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. “ప్రతిరోజూ రాత్రి నేను ఏం చేస్తున్నానో నాక్కూడా తెలియదు. ఒక తోడేలు నా శరీరాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఉన్నట్టుండి డ్రాకులా లాంటి పదునైనా కోరలు , పంజా , తోక కూడా వస్తున్నాయి. ఒక వేల నాకు నయం కాకపోతే నేను మనుషులను తింటూనే ఉంటా” అంటూ వరుణ్ చెప్పే సంభాషణలు అందరిని ఆకర్షిస్తున్నాయి.