NewsNews Alert

వరవరరావుకు శాశ్వత బెయిల్‌…

Share with

భీమా కోరేగావ్‌ కేసులో విరసం నేత వరవరరావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అనారోగ్య కారణాలతో శాశ్వత బెయిల్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టులో వరవరరావు పిటిషన్‌ వేసిన విషయం అందరికీ తెలిసిందే. 82 ఏళ్ల వయసున్న వరవరరావు ఇప్పటికే రెండున్నరేళ్లపాటు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారని తెలిపిన అత్యున్నత న్యాయస్థానం… కండీషన్స్‌తో కూడిన పర్మినెంట్‌ మెడికల్‌ బెయిల్‌ మంజూరు చేసింది. ముంబై నగరానికి దాటి ఎక్కడికి వెళ్లకూడదని షరతులు విధించింది. అలాగే బెయిల్‌ స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదని కూడా  తెలిపింది. కేసు దర్యాప్తును ఏ విధంగానూ ప్రభావితం చేయరాదని, సాక్షులతో సంప్రదింపులు జరపకూడదని వివరించింది. చికిత్సకు సంబంధించిన వివరాలను సైతం ఎన్‌ఐఏ సంస్థకు తెలియజేయాలని వరవరరావుకు ఆదేశించింది.

అంతకుముందు ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. వరవరరావు మెడికల్‌ గ్రౌండ్స్‌ మీద జస్టిస్‌ యుయు లలిత్‌, జస్టిస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ సుధాంశు దులియాతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిపి, ఈ మేరకు తీర్పు వెల్లడించింది.