Andhra PradeshNewsNews Alert

తిరుమల శ్రీవారి హుండీ రికార్డు ఆదాయం

Share with

కలియుగ దైవం, భక్తకోటికి కొంగుబంగారమైన వేంకటేశ్వరుని ఆలయానికి ఐశ్వర్యానికి కొదవ లేదు. భారతదేశంలోనే ధనిక దేవాలయంగా పేరుపొందింది… మన తిరుమల శ్రీవారి ఆలయం. గత ఐదు నెలలుగా హుండీ వసూళ్లలో ఎన్నడూ లేని రికార్డులను సృష్టిస్తోంది.

ప్రతీనెలా 100 కోట్ల మార్కును దాటిపోతోంది. మే నెలలో 130 కోట్ల హుండీ ఆదాయం రాగా, జూలై నెలలో ఏకంగా రూ. 139.45 కోట్లు రాబట్టింది. అతి ఎక్కువగా జూలై 4వ తేదీ 6.18 కోట్ల ఆదాయం లభించింది. పద్మావతీ పరిణయ సమయంలో కుబేరుని వద్ద అప్పు తీసుకున్న శ్రీవారు నేడు అపరకుబేరునిగా అవతరించారు.

ఆ పరమాత్ముని దివ్య ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానముల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో ప్రజాహితమైన కార్యక్రమాలు చేపట్టారు. TTD ట్రస్ట్ నిర్వహణలో S.V యూనివర్సిటీ, పద్మావతి మహిళ కళాశాల, గోశాల, ఆసుపత్రులు, పాఠశాలలు, నిత్యాన్నదాన సత్రాలు మొదలైనవి ఎన్నో నిరాటంకంగా నడుస్తున్నాయి. తన భక్తకోటికి ఏలోటూ లేకుండా తిరుమల గిరులపై ఉండడానికి కావల్సిన సమస్త సదుపాయాలు కల్పించారు ఆ శ్రీవారు. ఒక్క హుండీ మాత్రమే కాక విరాళాలు, తలనీలాలు సమర్పణ, ఇంకా  అనేక రకాల ఆర్జితసేవల ద్వారా కూడా భక్తులు… మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. స్వామికి సంవత్సరం పొడుగునా అనేక సేవలూ… ఉత్సవాలు జరుగుతూ ఉండాయి. దసరా నవరాత్రులలో జరిగే బ్రహ్మోత్సవాలు చూడడానికి మన రెండుకళ్లూ చాలవు. ప్రపంచంలోని ప్రతీ హిందువూ జీవితంలో ఒక్కసారైనా ఆ ఏడుకొండలవాని దర్శనం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు.