NationalNews

రాజ్యసభలో రగడ-19 మంది ఎంపీల సస్పెన్షన్

Share with

ధరల పెరుగుదల, ద్రవ్యోల్భణంపై చర్చ జరపాలని విపక్ష ఎంపీలు రాజ్యసభలో పోడియం ముందు ఆందోళనలు చేపట్టడంతో 19 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. రాజ్యసభలో 19 మంది ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ వెల్‌లోకి దూసుకువచ్చి కేంద్రానికి వ్యతిరేఖంగా నినాదాలు మొదలుపెట్టారు. సభాకార్యక్రమాలను జరగనీయకుండా అడ్డుకొంటున్నందుకు నిబంధనలను ఉల్లంఘించినందుకు వారం రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ చేశారు. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై ఉభయ సభల్లో గొడవలు కొనసాగిస్తూనే ఉన్నారు. తెలంగాణా నుండి బడుగు లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు సస్పెండ్ అయినవారిలో ఉన్నారు. ఏడుగురు టీఎంసీ ఎంపీలు,  తెలంగాణకు చెందిన ముగ్గురు ఎంపీలు, అయిదుగురు డీఎంకే ఎంపీలు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒక ఎంపీ ఉన్నారు. కాగా లోక్‌సభలో కూడా 4గురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. మాణికం ఠాగూర్, టి.ఎన్. ప్రతాపన్, జోతిమణి, రమ్యా హరిదాస్‌లను ఈవిడత సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేస్తున్నట్లు సభాపతి స్థానంలోని రాజేంద్ర అగర్వాల్ ప్రకటించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.