Home Page SliderTelangana

‘వాటిని జాతీయరహదారులుగా అప్‌గ్రేడ్ చెయ్యండి’..స్పీకర్

వికారాబాద్ నియోజకవర్గంలోని అత్యంత ముఖ్యమైన మూడు రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కోరారు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీని అధికార నివాసంలో ఈరోజు కలిశారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్. నియోజకవర్గంలోని 7 రోడ్లకు  Central Road Infrastructure Funds Scheme (CRIF) పరిధిలో నిధులను మంజూరు చేసి, నిధులను విడుదల చేయాలని ఆయనను కోరారు స్పీకర్. చేవెళ్ల MP కొండా విశ్వేశ్వరరెడ్డి, పెద్దపల్లి MP గడ్డం వంశీ కృష్ణ,  చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, తెలంగాణ లెజిస్లేటివ్ సెక్రటరీ డా వి నరసింహా చార్యులు, స్పీకర్ OSD పి. వెంకటేశం, నాయకులు మాణిక్ రెడ్డిలు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి నితిన్ గడ్కరీ ని కలిసారు.