NewsTelangana

తెలంగాణా ప్రభుత్వంపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఫైర్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ గత కొన్ని రోజులుగా తెలంగాణాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తాజాగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన వాటాలను ప్రజలకు చెప్పడానికి తెలంగాణ ప్రభుత్వానికి  అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు.  తెలంగాణ రాష్ట్రమంత్రులు ఏమైనా మాట్లాడే ముందు పూర్తిగా విని మాట్లాడాలని సూచించారు. అలా కాకుండా వ్యంగ్యంగా,వెటకారంగా మాట్లాడితే ఎలా సమాధానం ఇవ్వాలో కూడా తనకు తెలుసన్నారు.

రాష్ట్రం అప్పులు తీసుకువచ్చి చేసే పనులు ఆలస్యం అయితే కేంద్రానికి సంబంధం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2021వరకు ఆయుష్మాన్ భారత్‌లో ఎందుకు చేరలేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణకు 55% ఆదాయం హైదరాబాదు నుంచే వస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు పేరు మార్చి  తమ పథకాలని చెప్పడం మంచిది కాదన్నారు. ఆదిలాబాద్ ప్రాజెక్టుకు హైదరాబాద్ ఎంపీ ఫోటో పెట్టి ప్రచారం చేస్తారా అని మండిపడ్డారు. రిజైన్ సవాళ్ళను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాబట్టి ఎవరిని ఇంటికి పంపాలో ప్రజలకు బాగా తెలుసని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు .