Home Page Sliderhome page sliderNational

పంజాబ్‌లో నేల కూలిన గుర్తు తెలియని విమానం

ఆపరేషన్ సిందూర్ సమయంలో పంజాబ్‌లోని బటిండాలోని అక్లియన్ ఖుర్ద్ గ్రామంలో తెల్లవారుజామున 1:30 గంటలకు గుర్తుతెలియని విమానం కుప్ప కూలిపోయింది. ఇళ్ల నుండి 500 మీటర్ల దూరంలో గోధుమ పొలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఒక వ్యవసాయ కూలీ మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఆర్మీ టీం ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది.