InternationalNews

ఆ దేశంలో వర్క్ ఫ్రం హోమ్ చట్టబద్ధం కానుందా?

Share with

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనుహ్య పరిణామాలకు శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మాట్లడేవారు ఇప్పుడు మాత్రం కరోనా ముందు ,కరోనా తరువాత అని మాట్లాడేలా చేసింది. ఈ కరోనా ప్రజల ఆహారపు అలవాట్లను మాత్రమే కాకుండా వారి పని సంస్కృతిని కూడా పూర్తిగా మార్చివేసింది. దాదాపు 2 సంవత్సరాల నుండి ప్రపంచంలోని అన్నిప్రభుత్వ ,ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్‌కు అలవాటు పడ్డారు.అయితే ఇప్పటికీ కొన్ని సంస్థలు ఈ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్క ఫ్రం హోమ్ కు అలవాటు పడిన  కొందరు ఉద్యోగులు ఆఫీసుకు వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఈ క్రమంలో వర్క ఫ్రం హోమ్ విధానాన్ని చట్టబద్దం చేసే దిశగా నెదర్లాండ్స్ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీనిప్రకారం ఆ దేశంలోని కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులకు వర్క ఫ్రం హోమ్ సదుపాయాన్ని కల్పంచాలని కోరుతోంది. అలా కల్పంచలేని నేపథ్యంలో దానికి తగ్గ కారణాలు వివరించాలని సూచించింది. ఈ మేరకు దీనికి సంబందించిన బిల్లుకు ఆ దేశ దిగువ సభ ఆమోదం తెలిపింది. ఇక ఎగువ సభ కూడా ఆమోదం తెలిపితే ఇది చట్టబద్ధం కానుంది. దీనితో వర్క ఫ్రం హోమ్‌ను చట్టబద్ధం చేసిన మొదటి దేశంగా నెదర్లాండ్స్ నిలువనుంది.అయితే గతంలో స్కాట్లాండ్ ప్రభుత్వం ప్రభుత్వరంగ ఉద్యోగులు వారంలో 4 రోజులు ఇంటి నుండే విధులు నిర్వహించవచ్చని బదులుగా వేతనంలో కోత ఉంటుందని చెప్పడం వివాదాస్పదమైంది.