Home Page SliderTelangana

కన్నయ్యను చూడటానికి రెండుకళ్లూ చాలవు..

ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్ లోని ఇస్కాన్ దేవాలయంలో కన్నయ్య ని చూడడానికి భక్తులు పోటెత్తారు. కృష్ణాష్టమి సందర్భంగా దేవాలయాన్ని బాగా అలంకరించారు. దీనితో కన్నయ్యను చూడడానికి రెండుకళ్లూ చాలడం లేదు. ఇస్కాన్‌లో చాలా వైభవంగా జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారు. నేటి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్వామి వారిని దర్శించుకోవడానికి ఈసారి భారీ సంఖ్యలో భక్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి సమస్యలు రాకుండా చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.