Andhra PradeshHome Page Slider

శాంతిహోమం సందర్భంగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

తిరుమలలో శాంతిహోమం నిర్వహించిన అనంతరం టీటీడీ భక్తులకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. నేడు సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని, క్షమా మంత్రం చదవాలని పేర్కొన్నారు. లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలతో టీటీడీ శాంతిహోమం, సంప్రోక్షణ నిర్వహించింది. శ్రీవారి వంటశాలలలో, వివిధ నైవేద్యాల పోటులో ఈ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. అందుకే నేటి సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి, ‘ఓం నమో నారాయణాయ’, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’, ‘ఓం నమో వేంకటేశాయ’ అంటూ మంత్రాలను జపించి, స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని భక్తులకు సూచించారు.