‘లేదు, నేను దోషిని కాను’ విచారణలో తేల్చి చెప్పిన ట్రంప్
అమెరికా దేశ చరిత్రలో క్రిమినల్ కేసులో అరెస్టయిన మొదటి మాజీ అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. ‘లేదు, నేను దోషిని కాదంటూ’ పదే పదే కోర్టులో వాదన చేశారు ట్రంప్. శృంగార తార స్టార్మీ డేనియల్స్‌లో ఆయనకు సంబంధం ఉందని, అది బయటపడకుండా ఉండేందుకు అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారని ఆరోపించబడ్డారు ట్రంప్.

ఆయనను నిన్న(మంగళవారం) పోలీసులు అరెస్టు చేసి, న్యూయార్క్‌లోని మన్‌హటన్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి చదివి వినిపించిన మొత్తం 34 అభియోగాలను తిరస్కరించారు ట్రంప్. తాను దోషిని కాదని తేల్చి చెప్పారు. విచారణ అనంతరం తన మద్దతు దారులతో మాట్లాడుతూ అమెరికాకు చీకటి రోజులు దాపురించాయన్నారు.
దేశాన్ని ధ్వసం చేస్తున్నారని బైడన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆఫ్గానిస్తాన్ నుండి బలగాల ఉపసంహరణ, వలసల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు ప్రపంచం దృష్టిలో నవ్వులపాలయ్యాయన్నారు. వచ్చే ఎన్నికలలో వాటిని అడ్డుకుంటామని, తిరిగి అమెరికాను ఉన్నత దేశంగా మారుస్తానని వ్యాఖ్యానించారు.

