Home Page SliderNational

హంగ్ దిశగా త్రిపుర, మేఘాలయ ఫలితాలు

3 ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా కన్పిస్తున్నాయి. త్రిపురలో మరోసారి బీజేపీ అధికారం ఖాయమన్నట్టుగా కన్పిస్తున్నా.. అక్కడ టిప్రా పార్టీ భారీగా సీట్లను రాబట్టుకునేలా కన్పిస్తోంది. ప్రస్తుతం బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు 16 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఇక రాజవంశీకుల పార్టీ టిప్రా 12 స్థానాల్లో దూసుకెళ్తోంది. ఇక నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్‌డీపీపీ అధికారం దిశగా సాగుతున్నాయి. కూటమి 37 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా… ఎన్‌పీఎఫ్ 5, కాంగ్రెస్ 3, ఇతరులు 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక మేఘాలయలో హంగ్ అసెంబ్లీ ఖాయంగా కన్పిస్తోంది. ఎన్‌పీపీ 22 స్థానాల్లో ఆధిక్యం లో కొనసాగుతుండగా, టీఎంసీ 8, కాంగ్రెస్ 7, యూడీపీ 6, బీజేపీ 6, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మూడు రాష్ట్రాల్లోనూ మెజార్టీ మార్క్ 31 స్థానాలు.