NewsNews AlertTelangana

పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో విషాదం.. ఐదుగురు దుర్మరణం

Share with

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్ పనులకు అంతరాయం ఏర్పడింది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో స్కీం పనుల్లో విషాదం చోటుచేసుకుంది.లిష్ట్ ఇరిగేషన్ పనుల్లో భాగంగా క్రేన్ సాయంతో కొంతమంది కార్మికులు పంప్‌హౌస్‌లోకి దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఎప్పటిలాగే పనుల్లోకి వచ్చిన కార్మికులు , క్రేన్ సాయంతో పంప్‌హౌస్‌లోకి దిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో క్రేన్‌కి కట్టిన తాడు తెగిపడి ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరొకరు త్రీవంగా గాయపడ్డారు. కొల్లాపూర్ పట్టనంలోని రేగుమనగడ్డ వద్ద నిర్మాణం జరుగుతున్న పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ -1లో ఈ దుర్ఘటన జరిగింది.

గాయపడ్డ కార్మికుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన కార్మికులు అందరు బీహార్ వాసులుగా గుర్తించినట్టు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలని వారి బంధువులకు అప్పగించనున్నారు. ఈ వార్తతో మిగత కార్మకులు భయందోళనకు లోనయ్యారు. ఈ విషాదం కారణంగా పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.