17 ఏళ్లు దాటగానే ఓటు హక్కుకు దరఖాస్తు
కీలక ఎన్నికల సంస్కరణల దిశగా అడుగులు పడుతున్నాయ్. జనమే బలం… ఆ బలమే ప్రజాస్వామ్యమన్న స్ఫూర్తి దిశగా ఎన్నికల సంఘం తాజాగా అడుగులు వస్తోంది. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడంతోపాటు, డబుల్ ఓట్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో తొలగించేలా ఓటరుతో, ఆధార్ అనుసంధానంపై ముందడుగేస్తోంది. తాజాగా ముందస్తుగా ఓటు హక్కు దరఖాస్తు రిపోర్ట్ చేసేందుకు ఈసీ అనుమతిచ్చింది. వచ్చే ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనాలని భావిస్తున్న ఎన్నికల సంఘం అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇకపై ఓటర్లు ఎవరూ కూడా 18 ఏళ్లు వచ్చే వరకు ఆగాల్సిన అవసరం లేదని పేర్కొంది. మరోవైపు ఆగస్టు ఒకట్నుంటి ఆధార్ తో ఓటర్ల జాబితా అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఐతే ఇది ఎవరైనా స్వచ్ఛందంగా చేసుకోవచ్చని ఎలాంటి బలవంతం ఉండబోదని స్పష్టం చేసింది. ఐతే ఓటరు-ఆధార్ అనుసంధానంపై విపక్షాలు చాన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నాయ్. వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా హరించేందుకు మాత్రమే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు అమలు చేస్తోందని… వీటి వల్ల ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమంటూ గర్జిస్తున్నాయ్.
