మైసమ్మగూడలో విషాదం: ఇంజినీరింగ్ విద్యార్థి హత్యకు గురి
AP కృష్ణా జిల్లాకు చెందిన శ్రవణ్ సాయి (19) హైదరాబాద్ శివారు మైసమ్మగూడలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. కొద్ది నెలలుగా తన టెన్త్ క్లాస్‌మేట్ అయిన యువతితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత వారు శ్రవణ్‌ను పలుమార్లు హెచ్చరించినప్పటికీ, అతను సంబంధాన్ని కొనసాగించాడు. పెళ్లి విషయంపై మాట్లాడడానికి అమ్మాయి తల్లి శ్రవణ్‌ను ఇంటికి పిలిచింది. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా, ఆగ్రహంతో అమ్మాయి తల్లి బ్యాట్‌తో శ్రవణ్‌పై దాడి చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. తీవ్ర గాయాలతో కుప్పకూలిన శ్రవణ్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

