భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం: ట్రంప్
భారత్‌తో వాణిజ్య చర్చలు గొప్పగా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు. న్యూదిల్లీపై అగ్రరాజ్యం దాదాపు 26శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో దీనిపై ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈక్రమంలోనే వైట్‌హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ ఒప్పందం గురించి వ్యాఖ్యలు చేశారు భారత్‌తో టారిఫ్ చర్చలు గొప్పగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఇటీవల అమెరికాకు వచ్చారు. ఆ సమయంలో సుంకాలపై ఒక ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే అది జరుగుతుందని భావిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇక, ఇదే అంశంపై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య టారిఫ్ చర్చల్లో పురోగతి కనిపిస్తోందన్నారు. దీనిపై త్వరలో న్యూదిల్లీ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈసందర్భంగా ఇండియా వంటి సానుకూలమైన దేశాలతో చర్చలు జరపడం సులభమన్నారు.

