తెలంగాణలో మొత్తం ఓటర్లు 2 కోట్ల 95 లక్షలు
తెలంగాణలో తగ్గిన ఓటర్లు 6 లక్షలు
మహిళల కంటే పురుష ఓటర్లే అధికం
రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలు 34,891
ఏపీతో పోల్చుకుంటే కోటి ఓటర్లు తక్కువ
తెలంగాణలో ఓటరు ముసాయిదా జాబితా విడుదలయ్యింది. అదే సమయంలో 2021లో మొత్తం ఓటర్లు 3 కోట్ల ఒక లక్షా 65 వేల 569గా నిర్ధారించగా… తాజా లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం ఓటర్లు 2 కోట్ల 95 లక్షల 65 వేల 669గా ఉంది. మహిళ, పురుష ఓటర్లు సుమారుగా మూడేసి లక్షల చొప్పున తగ్గారు. హైదరాబాద్, రంగారెడ్డిలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్ పరిధిలో మొత్తం 41 లక్షల 46 వేల 965 మంది ఓటర్లుండగా… రంగారెడ్డిలో 30 లక్షల 47 వేల 439 మంది, మేడ్చల్లో 24 లక్షల 83 వేల 942 మంది ఉన్నారు. అత్యల్పంగా ములుగో 2 లక్షల 8 వేల 140 మంది ఓటర్లున్నారు. మొత్తంగా ఏపీ ఓటర్లతో పోల్చుకుంటే తెలంగాణలో సుమారుగా కోటి మంది ఓటర్లు తక్కువ.


